సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో ఉన్న డంపింగ్ యార్డు సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జేఏసీ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఉదయం గుమ్మడిదల, నర్సాపూర్ జేఏసీ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మురళీధర్ యాదవ్, సదానంద రెడ్డి, మద్దుల బాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉదయ్ లు పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును కలిసేందుకు బయలుదేరారు. డంపింగ్ యార్డు కారణంగా స్థానికులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భూగర్భ జలాలు కలుషిత మవుతున్నాయని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, డంపింగ్ యార్డును రద్దు చేసి ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని వారు ఎంపీ రఘునందన్ రావును కోరనున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమస్యను తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఢిల్లీకి వెళ్లిన జేఏసీ నాయకులు

Oplus_131072