ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 26 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని భిక్యా తండా గ్రామపంచాయతీ పరిధిలో సేవాలాల్ జగదాంబ గుట్ట ఆలయంలో సేవాలాల్ జగదాంబ దీక్షలు 23 మంది జగదాంబ మాలలు ధరించారు ఈ దీక్ష 21 రోజు కొనసాగుతుంది ఈ దీక్ష దారులు ఉదయం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు సేవాలాల్ భవాని మాత ముక్కోటి దేవతల పూజ చేస్తూ నామ స్మరణంలో ఉంటారు. ఉదయం 6 సమయంలో భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తామని 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ఆహారము తీసుకోకుండా మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష దారులు దేవతల ధ్యానంలో ఉంటారు. 21 రోజులు పూర్తయిన తర్వాత మహారాష్ట్రలోని పౌరాదీవిలో దీక్ష విరమణ చేస్తామని గురూ స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ జగదాంబ ఆలయ వ్యవస్థాపకులు మూడ్. సూర్యం చౌహన్, గురు మహారాజ్ మునోత్ రవి నాయక్ తిరుపతి మహారాజ్, శ్రీనివాస్ చౌహన్ మహారాజ్, వస్త్రం మహారాజ్, కుమార్ మహారాజ్, నినావత్ సాలి రామ్ మహారాజ్, సంతోష్ మహారాజ్, ప్రవీణ్ మహారాజ్, తదితరులు మహారాజులు మరియు కన్నె మహారాజులు పాల్గొన్నారు.