*” ప్రజా దర్బార్ “* *నిర్వహించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి .*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 16( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు
ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయకజగదీశ్వరి అన్నారు. శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలుపుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సమస్యలు విన్న ఎమ్మెల్యే సమస్యల గురించి సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమస్యలు త్వరగా పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, నాయకులు దత్తి లక్ష్మణరావు, నంగిరెడ్డి మధుసూదన్ రావు, గుల్లిపల్లి సుదర్శన్ రావు, రామారావు, కడాయి బాసింగి టిడిపి నాయకులు మండల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు