బి.ఆర్.అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

*బి.ఆర్.అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండల కేంద్రాల్లో సోమవారం నాడు ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే *తోయక* *జగదీశ్వరి* ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ స్మృతికి నివాళులర్పిస్తున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్క కృషి ఎనలేనిది. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు కృషి చేద్దాం. దళితుల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో కన్వీనర్ కొండయ్య, ఏఎంసి చైర్ పర్సన్ కడ్రక కళావతి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్, ఎస్ఎంసి చైర్మన్ రాజేష్, దూళికేశ్వరరావు, అనిల్ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment