యోగా జీవితంలో భాగం కావాలి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

*యోగా జీవితంలో భాగం కావాలి*

*ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 9( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీడీవో సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుండి ఎల్విన్ పేట జంక్షన్ వరకు సోమవారం నాడు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యవంతులుగా జీవించాలంటే దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో, పంచాయతీ, సచివాలయ, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment