డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే తిరుమల వెళ్లని జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ… జగన్‌కు సూటి ప్రశ్నలు సంధించిన చంద్రబాబు
చట్టాన్ని కాపాడే సీఎం హోదాలో ఉండి కూడా అప్పట్లో జగన్ దానిని ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. సీఎం హోదాలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి జగన్‌కు సిగ్గుండాలి. దేవుడి దర్శనానికి వెళ్లే ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందే’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తుచేశారు. ఈ దివ్య క్షేత్రం ఏపీలో ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం అని, తిరుమలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, ఇక దళితుల్ని దేవాలయాల్లోకి రానిస్తారా? అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారని.. మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ, కావాలని ఇతరులపై బురద జల్లడమేంటని మండిపడ్డారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపిన నెయ్యిలో కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ చెప్పినట్లుగా జగన్ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తామేదో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లుగా జగన్ తమపై అభాండాలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆ నివేదిక బయటకు వస్తే తాము తప్పు చేసినట్లవదా అని అన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్లకు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కిలో రూ.319కి కాంట్రాక్ట్ ఇచ్చి, నాణ్యత లేని, నాసిరకం నెయ్యి కొని ప్రసాదాల్ని ఎందుకు అపవిత్రం చేశారని నిలదీశారు. తిరుమలలో ప్రసాదం, అన్నదానంలో పెట్టే భోజనం బాగాలేవని, గదులు శుభ్రంగా ఉండట్లేదని వైసీపీ హయాంలో భక్తులు ఎన్నిసార్లు ఆందోళనలు చేశారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేయకూడని ఘోరాలన్నీ చేసి, ఇప్పుడు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.మాజీ ముఖ్యమంత్రినైన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, ఇక దళితుల్ని దేవాలయాల్లోకి రానిస్తారా? అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారని.. మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ, కావాలని ఇతరులపై బురద జల్లడమేంటని మండిపడ్డారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపిన నెయ్యిలో కల్తీ జరగలేదని టీటీడీ ఈఓ చెప్పినట్లుగా జగన్ పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తామేదో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లుగా జగన్ తమపై అభాండాలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆ నివేదిక బయటకు వస్తే తాము తప్పు చేసినట్లవదా అని అన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్లకు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కిలో రూ.319కి కాంట్రాక్ట్ ఇచ్చి, నాణ్యత లేని, నాసిరకం నెయ్యి కొని ప్రసాదాల్ని ఎందుకు అపవిత్రం చేశారని నిలదీశారు. తిరుమలలో ప్రసాదం, అన్నదానంలో పెట్టే భోజనం బాగాలేవని, గదులు శుభ్రంగా ఉండట్లేదని వైసీపీ హయాంలో భక్తులు ఎన్నిసార్లు ఆందోళనలు చేశారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేయకూడని ఘోరాలన్నీ చేసి, ఇప్పుడు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.