Site icon PRASHNA AYUDHAM

రాహుల్ గాంధీకి ఆహ్వాన పత్రిక అందజేసిన జగ్గారెడ్డి దంపతులు

IMG 20250714 144838

Oplus_0

IMG 20250714 144851
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల దంపతులు తన కుమార్తె జయారెడ్డి వివాహానికి హాజరు కావాలని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆగస్టు 7న సంగారెడ్డి రామ్ మందిరంలో జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి రాహుల్ గాంధీ హాజరవ్వాలని కోరుతూ సోమవారం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ప్రత్యేకమైన ఈ శుభసందర్భంలో రాహుల్ గాంధీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకున్న అనుబంధం మేరకు రాహుల్ గాంధీని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
Exit mobile version