సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో నవంబర్ 5న జరగనున్న సదర్ ఉత్సవ సమ్మేళనం పోస్టర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి గురువారం ఆవిష్కరించారు. సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి సంబంధించి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సదర్ పండుగ దేశ వ్యాప్తంగా గోపాలకుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేర్యాల ఆంజనేయులు కుర్మ యాదవ్, మాజీ ఎంపీపీ తొగర్ పల్లి ప్రభు కుర్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సదర్ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన జగ్గారెడ్డి
Published On: October 30, 2025 8:36 pm