ఘనంగా జిల్లా స్థాయి గీతా శ్లోక కంఠస్థ పోటీలు 

గీతా శ్లోక
Headlines
  1. భగవద్గీత శ్లోక పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన
  2. జగిత్యాలలో 300 మంది విద్యార్థుల గీతా శ్లోక కంఠస్థ ప్రదర్శన
  3. భగవద్గీత 700 శ్లోకాలు వల్లించిన శ్రీరామ్‌కి ప్రత్యేక అభినందనలు
  4. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జడ్పీ బాలికల పాఠశాలలో పోటీలు
తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులు ఆరవ అధ్యాయములోని 47 శ్లోకాలు కంఠస్థం చేసి పోటీలలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని సుమారు 10 పాఠశాలల విద్యార్థులు వివిధ గ్రామాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో మురళి, మని చరణ్, చిన్నూరి మమత, నాగారపు దీక్ష, ప్రథమ ద్వితీయ ద్వితీయ బహుమతులు పొందారు. జూనియర్ విభాగంలో జూనియర్ విభాగంలో సురుకుట్ల చరిత, భోగ మనుశ్రీ, కొక్కెర హారిక ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. అదేవిధంగా 18 అధ్యాయాలు 700 పూర్తిగా కంఠస్థం చేసి ఎక్కడ అడిగితే అక్కడ శ్లోకాలు 18 సంవత్సరాలు పైబడిన వారికి జరిగిన పోటీలలో మహిళలు పాల్గొని కనులకు వింపుగా శ్లోకాలు వల్లె వేశారు. విద్యార్థులు అందరూ కూడా ఆశ్చర్య చకితలు అయ్యారు శ్రీమతి పోల హిమబిందు, ఆమెటి వనమాల, కంచర్ల లత ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. జూనియర్ విభాగంలో ఆమెటి శ్రీరామ్ అద్భుతంగా 700 శ్లోకాలు చెప్పి అందరిని అబ్బురపరిచారు. అతిథులు అందరు ఆమెటి శ్రీరాముని అభినందించారు. పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ప్రముఖ కవి బట్టు హరికృష్ణ, గీత సత్సంగ్ మెట్పల్లి ఉపాధ్యక్షులు మర్రి భాస్కర్, గీత సత్సంగ్ కోరుట్ల ఉపాధ్యక్షులు చిట్టిపల్లి శంకర్, జడ్పీ ఉన్నత పాఠశాల బాలికల ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్, జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు భాస సుమలత, టీటీడీ ధర్మాచార్యులు మంచాల జగన్ లు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గంగుల నరేషo హాజరై విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. టీటీడీ ధర్మాచార్యులు మంచాల జగన్, టిటిడి కార్యక్రమ నిర్వాహకుడు రామిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment