పోస్టుమాన్ సిబ్బందికి జాగృతి పత్రిక ఆత్మీయ సన్మానం

పోస్టుమాన్ సిబ్బందికి జాగృతి పత్రిక ఆత్మీయ సన్మానం

కరీంనగర్ అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం

జాగృతి తెలుగు జాతీయవాద వార పత్రిక ఆధ్వర్యంలో శనివారం రోజున కరీంనగర్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్టుమాన్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా జాగృతి పత్రిక బాధ్యులు కార్యక్రమానిర్వాకులు మాట్లాడుతూ దేశ సేవలో ప్రతి వృత్తి ఒక సాధనమని పోస్టుమాన్ సేవలు సమాజానికి అతి సమీపంగా ఉండే సేవలని తెలిపారు జాగృతి పత్రికను సకాలంలో చందాదారులకు చేరవేయడంలో పోస్టుమాన్‌లు చూపిస్తున్న కర్తవ్య నిబద్ధత సమయపాలన ప్రశంసనీయమన్నారు.

గత రెండేళ్లుగా జాగృతి పత్రిక ఆధ్వర్యంలో తపాల సిబ్బందికి సేవా గౌరవం కొనసాగుతోందని వివిధ సందర్భాల్లో పోస్టుమాన్‌లకు రెయిన్‌కోట్లు, వాటర్ బాటిల్స్, గొడుగులు, టవల్స్ వంటి అవసరమైన వస్తువులు అందజేసి వారి సేవలకు గౌరవం తెలుపుతున్నామని చెప్పారు. గత 77 సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతున్న జాగృతి పత్రిక ద్వారా అసలైన సమాచారాన్ని సమాజానికి అందించడంలో పోస్ట్ మెన్ ల భాగస్వామ్యం ఎప్పటికీ ఉండాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పోస్ట్మాస్టర్ తిరుపతి, విభాగ వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళీధర్,జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీనివాస్, ఓదెల మల్లికార్జున్, బట్టు వెంకటేష్, భూమ్ రావు, ఓరుగంటి విష్ణు, బాబురావు , పోస్ట్ మెన్ ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now