*జై బాపు, జై..భీమ్.. జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు*
మహాత్మా గాంధీ వారసత్వాన్ని, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై బాపు, జై..భీమ్.. జై సంవిధాన్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జై భీమ్
జై బాపు జై సంవిధాన్ లో భాగంగా బుధవారం
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి
మండలం దేవుని తిరుమల పూర్, వెన్నెచర్ల గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి స్వతంత్ర పోరాటంలో పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 70 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తే నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో తిరోగమనంలో పయనిస్తు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.