Site icon PRASHNA AYUDHAM

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు సిద్ధం కావాలి: జై గౌడ ఉద్యమం పిలుపు

IMG 20250801 WA0038

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు సిద్ధం కావాలి: జై గౌడ ఉద్యమం పిలుపు

➡️ 375వ జయంతి ఆగస్టు 10న రవీంద్రభారతిలో

➡️ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ

➡️ జాతీయ అధ్యక్షుడు వట్టికూడి రామారావు గౌడ్ పిలుపు

➡️ అధిక సంఖ్యలో గౌడ సోదరులు పాల్గొనాలని కోరింపు

➡️ పలువురు నాయకుల సమక్షంలో కార్యక్రమం

కామారెడ్డి:గౌడ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు జై గౌడ ఉద్యమం ఉద్యమిస్తోంది. ఆగస్టు 10న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరగనున్న వేడుకలను విజయవంతం చేయాలని జాతీయ అధ్యక్షుడు వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ప్రచారంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ, “పాపన్న గౌడ్ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి గౌడబిడ్డ ముందుకు రావాలి” అని అన్నారు.

జయంతి వేడుకలకు కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుండి గౌడ సోదరులు తరలివచ్చి పెద్దఎత్తున పాల్గొనాలని నేతలు కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొంబోతుల లింగాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రూరి సిద్ధా గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కర్రోళ్ల శేఖర్ గౌడ్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, పల్లె దేవేందర్ గౌడ్, భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version