వనపర్తి పట్టణంలో టౌన్ ఎస్ఐ జయన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వ్యక్తులు పట్టుబడగా వనపర్తి న్యాయస్థానం ముందు హాజరు పరచగా న్యాయమూర్తి జైలు శిక్ష విధించినట్లు పట్టణ ఎస్ఐ జయన్న తెలిపారు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ కు రెండు రోజులు శిక్ష విధించినట్లు ఇదే కేసులో వనపర్తి పట్టణానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష దొండకుంటపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కు ఒకరోజు శిక్ష వనపర్తి పట్టణానికి చెందిన ఈశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తికి ఒకరోజు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై జయన్న తెలిపారు, వనపర్తి న్యాయమూర్తి శ్రీలత తీర్పు మేరకు డ్రంకన్ డ్రైవ్ లో పై వ్యక్తులు శిక్ష అనుభవిస్తున్నట్లు టౌన్ ఎస్సై జయన్న తెలిపారు, వనపర్తి పట్టణంలో విచ్చలవిడిగా మధ్యమును సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు శిక్షలు విధించడమే కాక జరిమానాలు కూడా విధిస్తున్నట్లు ప్రతి ఒక్కరు మద్యం సేవించి వాహనాలు నడిపే విధానాన్ని స్వస్తిపరకాలని అదేవిధంగా ఎలాంటి లైసెన్సులు లేకుండా త్రిపుల్ రైడింగ్ చేసినా కూడా కటక చర్యలు తీసుకుంటామని పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు, వయసుతో సంబంధం లేకున్నా ఏ వ్యక్తి అయినా చట్టాలకు లోబడి పని చేయాలని ఆయన సూచించారు, ఎస్సై జయన్న నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పురోగతి పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు,
ప్రశ్న ఆయుధం బ్యూరో జూలై25