Site icon PRASHNA AYUDHAM

హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి

IMG 20250502 WA1508

*హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి*

*హైదరాబాద్:మే 02*

హైదరాబాద్ లో జరుగు తున్న మిస్ ఇండియా వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబైన విషయం తెలిసిందే. మిస్స్ ఇండియా పోటీలను సమీక్షించేందుకు టీం నగరానికి వచ్చింది, లండన్ నగరానికి చెందిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో చైర్పర్సన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.

ఈనెల 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నా యి. పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా ఈవేలిన్‌ మోర్లీ ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు సంప్రదాయరీతిలో అధికారులు ఘటన స్వాగతం పలికారు.

రేపటి నుంచి మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లను జూలి యా సమీక్షించనున్నారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకో వడం ప్రపంచ ప్రేక్షకులకు రాష్ట్ర అద్భుత వారసత్వా న్ని చూపించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం గురించి మాత్రమే కాదు, మహిళలకు సాధికారత కల్పించడం, అందం పట్ల ఐక్యంగా ఉండే మన నిబద్ధత, స్థిరమైన ప్రభావాన్ని చూపుతాయని జూలియా అన్నారు.

Exit mobile version