*ప్రజా సొమ్ము వృధా కాకుండా ఉండాలంటే జమిలి ఎన్నికలు దేశానికి అవసరం*
*
*రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బట్టబయలైంది*
*రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్*
*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*
*ఇల్లందకుంట మార్చి 24 ప్రశ్న ఆయుధం*
ఒకే దేశం ఒకే ఎన్నిక భారతదేశానికి ఎంతో అవసరమని ప్రజా సొమ్ము వృధా కాకుండా ఉండాలంటే జమిలి ఎన్నికలు దేశానికి అవసరమని ప్రస్తుత ఎన్నికల విధానంలో సమూల మార్పులు జరగాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఇల్లందకుంట మండల కేంద్రంలో సోమవారం రోజున ఏర్పాటు చేసిన బిజెపి మండల సమావేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ ప్రోగ్రాం నిర్వహించారు సమావేశానికి హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో, పార్లమెంటుకు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని తరచుగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగడం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంలో ఎన్నికలు నిర్వహించాలనన్నారు, జమిలి ఎన్నిక విధానంపై ప్రజలకు అవగాహన తీసుకురవడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తగిన కృషి చేయాలన్నారు ఆ దిశగా అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించి ప్రజలకు తెలియజేయాలన్నారు అలాగే రుణమాఫీ పై కాంగ్రెస్ మోసపూరిత వైఖరి నేడు బట్టబయలైందన్నారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై చేసిన ప్రకటన, రెండు లక్షల పైచిలుకు రుణం ఉన్న వారికి రుణమాఫీ చేసే ప్రసక్తి లేదని మంత్రి తుమ్మల అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసి రైతుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేడు రుణమాఫీ విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు కాంగ్రెస్ సర్కార్ నాలుగు విడతల్లో అరకోర రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల పై ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసేది లేదని వ్యాఖ్యానించడం దారుణమన్నారు ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నేడు కొందరికే చేసిందని రుణమాఫీ విషయంలో అనేక ఆంక్షలు నిబంధనలు పెడుతూ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతాంగాన్ని మోసం చేసినట్టు 6 గ్యారంటీలు, 420 హామీల విషయంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ప్రస్తుతం డబ్బులు పుట్టడం లేదని అప్పు ఎవరు ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్ రెడ్డికి , కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకర్తలకు తెలియదా..? ఇప్పుడు కాంగ్రెస్ చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు. 16 నెలల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ఈ కార్యక్రమం లో కన్వీనర్ అబ్బిడి తిరుపతి రెడ్డి, కో కన్వీనర్ గుత్తికొండ రాంబాబు ఉప్పుల రమేష్ కంకణాల రవీందర్ రెడ్డి,ఆరెల్లి శ్రీనివాస్ కంకణాల సురేందర్ రెడ్డి గురుకుంట్ల సాంబన్న, కొత్త శ్రీనివాస్ ఎండీ షఫీ,నల్ల లింగారెడ్డి,రావుల విజయ్ బాబు, తాళ్ల పాపిరెడ్డి, మురహరి గోపాల్, చిట్ల శ్రీనివాస్, ఉప్పుల శ్రీనివాస్, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, జోడు సంపత్, గురుకుంట్ల సంజీవ్, చిట్ల తిరుపతి, గుడికందుల రమేష్,జంగం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు