మంత్రి లోకేష్ దృష్టికి జంఝావతి సమస్య…!

*మంత్రి లోకేష్ దృష్టికి జంఝావతి సమస్య…!*

*కూటమి పాలనలో పూర్తిచేయాలని మంత్రి లోకేష్ ను కోరిన జంఝావతి సాధన సమితి

పార్వతీపురం: మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

గత ఐదు దశాబ్దాలుగా పూర్తికాని జంఝావతి సమస్యను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి జంఝావతి సాధన సమితి తీసుకువెళ్ళింది. సోమవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్

పార్వతిపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జంఝావతి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేసినట్లు జంఝావతి సాధన సమితి కార్యచరణ కన్వీనర్ మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రంలో కబ్జాకు గురవుతున్న చెరువులను రక్షించే చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఒడిశా ప్రభుత్వంతో ఉన్న అడ్డంకులను బూచిగా చూపించి గత ఐదు దశాబ్దాలు పెండింగ్ లో ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి జంఝావతి ఆయికట్టు రైతులను ఆదుకోవాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితి తరపున మంత్రి లోకేష్ ని కోరినట్లు తెలిపారు. కేంద్రంలోనూ, ఒడిశా లోను, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం వలన జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రస్తుత సమయం అత్యంత అనుకూలమైనదిగా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో కూడా జంఝావతి ప్రాజెక్టు చర్చికి వచ్చిందని తెలియజేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో జంఝావతి సాధన సమితి చుక్క భాస్కరరావు, జాగారపు ఈశ్వర ప్రసాద్, అల్లు సత్యం, జగన్నాథ్ ప్రసాద్ రాయగురు, చుక్క చందర్రావు, వారణాసి శ్రీహరి, సెల్లారపు వెంకట నాయుడు శ్రీ భారతానంద స్వామీజీ, పల్లె తేజ లక్ష్మి, దయామణి, తీళ్ళ గౌరిశంకర రావు, మేసిశెట్టి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment