రైతు సేవలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్*
*రైతు పండుగను ఆనందంగా జరుపుకోవాలి*
వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం*
జమ్మికుంట నవంబర్ 28 ప్రశ్న ఆయుధం
ఉత్తర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ యార్డ్ గా పేరొందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి ఉత్పత్తులను అధిక ధరలకు క్రయవిక్రయాలు జరుపుతూ తెలంగాణలోని అన్ని మార్కెట్ యార్డులలో కంటే ఎక్కువ సదుపాయాలను కల్పిస్తూ రైతులకు అందుబాటులో ఉంటున్నామని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి సెక్రటరీ ఆర్ మల్లేశం అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు పండుగ మన కార్యక్రమం పురస్కరించుకుని గురువారం జమ్మికుంట మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్మికుంట మార్కెట్ యార్డ్ కు కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధిక మొత్తంలో జమ్మికుంట మార్కెట్ యార్డుకు తరలిస్తుంటారని, ఆ క్రమంలో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జమ్మికుంట మార్కెట్ యార్డ్ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతులకు ఎల్లవేళలా సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నామన్నారు.
*
జమ్మికుంట మార్కెట్ ఆదాయం గతంతో పోల్చుకుంటే 2023 -24 సంవత్సరంలో గణనీయంగా పెరిగిందని, దీనికి సహకరించిన రైతు సోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే రైతులందరూ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ ద్వారా క్రయవిక్రయాలు చేసినట్లయితే అధిక ధరలు పొందే వీలు కలుగుతుందని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ,వ్యవసాయ శాఖకు ఎక్కువ మొత్తంలో లాభాలు చేకూరుతాయని 75 సంవత్సరాల చరిత్ర కలిగిన మార్కెట్ కమిటీకి తొలిసారి ఒక మహిళను చైర్మన్ ను నియమించడం పట్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపి హర్షం వ్యక్తం చేశారు 2023 -24 కంటే 24- 25 లో పంట ఉత్పత్తులు పంట విక్రయాలు ఎక్కువగా జరిగాయన్నారు. లైసెన్స్ హమలి దాడువై ఆడకూలీలకు 771 మందికి 2000 చొప్పున ప్రతి ఒక్కరికి ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని మార్కెట్ యార్డుకు వచ్చేటువంటి ప్రతి రైతుకు కనీస సౌకర్యాలు అనగా మంచినీరు ,విశ్రాంతి గదులు, క్యాంటీన్, ఆర్ ఓ, వాటర్ మొదలగునవి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ప్రతి రైతుకు ప్రజాపాలనలో అందుబాటులో ఉంటూ అన్నివేళలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. యార్డుకు వచ్చేటువంటి రైతు సరుకులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను ఇప్పించడం ,ప్రైవేటు కొనుగోలుదారుల ద్వారా పోటీ ధరలను ఇప్పించడమే ప్రధాన లక్ష్యంగా జమ్మికుంట మార్కెట్ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు