*పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయి మొదటి నిలిచిన జమ్మికుంట మున్సిపాలిటీ*
*మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయ్యాజ్*
*జమ్మికుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*
మున్సిపాలిటీల ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించినందుకు మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ పాలక వర్గానికి, మున్సిపాలిటీ ప్రజలకు, పత్రిక మిత్రులకు మున్సిపల్ కమిషనర్ ముహమ్మద్ అయాజ్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలిచామని ఆయన అన్నారు. నల్ల బిల్లు వసూల్ లో స్టేట్ లో మూడో స్థానం, భువన్ లో వంద శాతం పూర్తి చేసుకొని నాలుగో స్థానములో నిలిచామనీ తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీలో ఇంకా పన్నులు చెల్లించె వారు ఉన్నారని వచ్చే నెల చివరి వరకు పూర్తిస్థాయిలో పన్నుల వసూళ్లు చేయాలని కమిషనర్ ఆయాజ్ అన్నారు.మార్చి నెల చివరి వరకు వంద శాతం వసూలు చేయాలని కోరారు. పన్నుల వసూళ్లకు సహకరిస్తున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గానికి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్,భాస్కర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11