వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

కొనుగోలు
Headlines :
  1. రైతులకు మద్దతు ధరలు అందించడానికి జమ్మికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
  2. ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరలు పొందండి – పిఎసిఎస్ చైర్మన్ సూచన
  3. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
  4. దళారులకు విక్రయించవద్దని సూచన – రైతులకు మద్దతు ధరల ప్రాధాన్యతపై చైర్మన్ స్పష్టం

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం*

*రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలి*

*జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్*

*జమ్మికుంట నవంబర్ 4 (ప్రశ్న ఆయుధం)::-*

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్ ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బీ గ్రేడ్ కు రూ.2,300తో పాటు రూ.500 బోనస్ పొందాలని సూచించారు ఇంటి వద్దనే ధాన్యం ఆరబెట్టుకు రావాలని యార్డులో ఆరబెట్టడం వల్ల మిగితా రైతులకు విక్రయించుకోవడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, మార్కెట్ సెక్రెటరీ ఆర్ మల్లేశం వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి సీఈవో రవీందర్ డైరెక్టర్లు తిరుపతిరావు రాధిక, రాజయ్య, తిరుపతి, శ్రీలత, రాజశేఖర్, కుమార్, సమ్మయ్య, బక్కయ్య, లింగారావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now