*బాధ్యతలు స్వీకరించిన ఎస్సై జన్ను ఆరోగ్యం*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*
జమ్మికుంట పట్టణ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇ.వివేక్ తిమ్మాపూర్ కు బదిలీ కాగా నూతన జమ్మికుంట పట్టణ ఎస్సైగా జన్ను ఆరోగ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం సైదాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించి అక్కడినుండి బదిలీపై జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి పోస్టింగ్ 2016లో బీర్పూర్ లో చేయడం జరిగిందని పై అధికారుల మార్గదర్శకత్వంలో చట్ట పరిధిలో ప్రజల శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా పనిచేస్తానని తెలిపారు.