చలివేంద్రం ఏర్పాటు చేసిన జన వికాస్ స్వచ్ఛంద సేవ సంస్థ

*చలివేంద్రం ఏర్పాటు చేసిన జన వికాస్ స్వచ్ఛంద సేవ సంస్థ*

*జమ్మికుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో జన వికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రోజున దొడ్డె లావణ్య-సుధాకర్ సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ (జన వికాస) బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలలో భాగంగా బాటసారుల దాహాన్ని తీర్చేందుకు బాలవికాస సంస్థ మహిళలు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఇలాంటి సేవ మా గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన,కోఆర్డినేటర్ స్వాతి, మామిడి తిరుపతిరెడ్డి, ఎగితే కుమార్ వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.

*ఘనంగా అంబేద్కర్ జయంతి*

యావత్ ప్రపంచం గుర్తించిన మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కేకు కట్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బిసి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు మహిళలకు ఈరోజు దొరుకుతున్న గౌరవ మర్యాదలు అంబేద్కర్ కృషి ఫలితమేనని సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కరును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment