కులగణన సర్వేలో తప్పులు దొర్లితే చర్యలు తప్పవు.. -జనగామ జిల్లా కలెక్టర్..

కులగణన సర్వేలో తప్పులు దొర్లితే చర్యలు తప్పవు..
-జనగామ జిల్లా కలెక్టర్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు, పాలకుర్తి గూడూరు గ్రామాల్లో చేస్తున్న సర్వేను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 130 మంది ఎన్యుమరేటర్ లను ఉంచామని తెలిపారు. సర్వే ఫారంలో ఉన్న 75 ఖాళీలను పూర్తిగా నింపాలని అన్నారు, కులగణన సమగ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు, సమగ్ర కుల గణన ఫారంను కాలి లేకుండా పూర్తిగా నింపాలన్నారు, రోజుకు 10 ఇండ్లు మాత్రమే సర్వే చేయాలని అన్నారు. తప్పులు దొరలకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు, సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలన్నారు.

Join WhatsApp

Join Now