జంగంపల్లి వ్యక్తికి బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలు
హైదరాబాద్‌కు తరలించిన ప్రవీణ్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 11
కామారెడ్డి జిల్లా లింగుపల్లి సమీపంలో బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జంగంపల్లి గ్రామానికి చెందిన చెన్నప్ప గారి ప్రవీణ్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి (42) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించి, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.