జవాన్, కిసాన్ కే బిజెపి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ

జవాన్, కిసాన్ కే బిజెపి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ

పీఎం కిసాన్ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి నేతలు

శంకరపట్నం ఆగస్టు 2 ప్రశ్న ఆయుధం

దేశానికి రక్షణగా ఉండే జవాన్ కు దేశానికి అన్నం పెట్టే కిసాన్ కి బిజెపి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం ఆనందదాయకమని బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అన్నారు. శనివారం 20 వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలలో జమ చేసినందన వారణాసి నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి ప్రసంగించగా కేశవపట్నంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులకు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ వెంకటేష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, నాయకులు దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, మందాడి జగ్గారెడ్డి, బిజిలి సారయ్య, పడాల వెంకటలక్ష్మి, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, రమణ రెడ్డిలతో పాటు ఏఇఓలు, వివిధ గ్రామాల రైతులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment