జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరుగు సిపిఎం రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయండి
సిపిఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
జనవరి 25 న జరుగు బహిరంగ సభ జయప్రదం చేయండి
ముఖ్యఅతిథిగా పాల్గొనున్న పోలీట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందాకరత్, కామ్రేడ్ బి వి రాఘవులు
సిద్దిపేట జనవరి 17 ప్రశ్న ఆయుధం :
జనవరి 25-28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగు సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున రాష్ట్ర మహాసభల జయప్రదానికై పార్టీ జెండా ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి గారు ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు మొట్టమొదటిసారిగా సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి రాబోవు మూడు సంవత్సరాల కాలం పాటు రాజకీయ విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. వీటితోపాటు వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన చర్చ జరిపి ఆ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేయడానికి భవిషత్ కార్యచరణను రూపొందించుకుంటామని తెలిపారు. ఈ మహాసభల ప్రారంభం రోజు 25వ తేదీన సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకి ముఖ్యఅతిథిగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్, కామ్రేడ్ బి వి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, చేరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు వక్తులుగా పాల్గొంటారని తెలిపారు. కావున కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాల్ స్వామి, రాళ్ల బండి శశిధర్, సిపిఎం సిద్దిపేట అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు జాలిగాపు శిరీష, అర్బన్ మండల నాయకులు కొండం సంజీవ్ కుమార్, వంగ రవీందర్ రెడ్డి, తాడిశెట్టి ఆంజనేయులు, అభిషేక్ బాన్, కళావతి, రఘునందన్, చెప్ప్యాల బాలమణి తదితరులు పాల్గొన్నారు.