వనపర్తి 22న జరిగే ఎస్పీడీసీఎల్ కంపెనీ మహాసభను జయప్రదం చేయండి

వనపర్తి 22 న జరిగే ఎస్పీడీసీఎల్ కంపెనీ మహాసభ ను జయప్రదం చేయండి

ఆర్టిజన్ కార్మికులను కన్వెన్షన్ చేయాలి

మీటర్ రీడలకు కనీస వేతనం అమలు చేయాలి

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ మరాఠీ కృష్ణమూర్తి

జగదేవపూర్ డిసెంబర్ 15 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప సబ్ స్టేషన్ లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ మరాటి కృష్ణమూర్తి పాల్గొని అనంతరం మాట్లాడుతూ 22 న వనపర్తి లో జరిగే ఎస్పీడీసీఎల్ కంపెనీ మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు. ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వెన్షన్ చేయాలని, అర్హతలను బట్టి ఆర్టిజన్లందరినీ జేఎల్ఎం సబ్ ఇంజనీర్ సబ్ ఆర్డినేట్ తదితర ఉద్యోగాలకు కన్వెన్షన్ చేయాలని అన్నారు. మీటర్ రీడర్ లకు కనీస వేతనం అమలు చేయాలని మీటర్ రీడర్లకు పీసి రేటు పెంచాలని, మీటర్ రీడర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మరాఠీ కృష్ణమూర్తి, నూతన మండల అధ్యక్షులుగా అక్కరాజ శ్రీను
ఉపాధ్యక్షులుగా హరిబాబు, పెరిక నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొంగర స్వామి, కార్యదర్శివర్గ సభ్యులుగా కృష్ణారెడ్డి భాస్కర్ మధు శ్రీకాంత్, కోశాధికారిగా కర్నే భాస్కర్, ప్రచార కార్యదర్శిగా నరేష్ తిరుపతి, సలహాదారులుగా టీ మురళి
కమిటీ సభ్యులుగా శ్రీధర్ , షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now