ఢిల్లీలో జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి వేడుకలు..

ఢిల్లీలో జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి వేడుకలు..

ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్….

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులు అర్పించారు.బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసంలో ఆ మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆ మహనీయులు స్వరాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంతో పాటు తెలంగాణ సమాజానికి వారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, మనోహర్ రెడ్డి,రాజేష్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంఎల్సీ మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, ముఖ్యనేతలతో కలసి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు, ఆ మహనీయులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment