జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న జరిగిన సామాజిక కార్యకర్త హత్య 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న జరిగిన సామాజిక కార్యకర్త హత్య 

భూపాలపల్లి జంగేడు గ్రామంలో నివసించే నాగవల్లి రాజలింగమూర్తి నిన్న సాయంత్రం ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రెడ్డి కాలనీ రోడ్డు దగ్గర కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోవడం జరిగింది కత్తిపోట్లకు కడుపులో ఉన్న పేగులు బయటికి రావడం జరిగింది విపరీతమైన రక్తస్రావం కొద్దిసేపు విలపించి అక్కడికక్కడే రాజలింగమూర్తి మృతి చెందడం జరిగింది

భూపాలపల్లి జిల్లాలో అనేక గవర్నమెంట్ భూముల మీద మరియు ప్రైవేట్ కంపెనీల మీద న్యాయస్థానాలలో రాజలింగమూర్తి కేసులు వేయడం జరిగింది వాటికి అలాగే ప్రతిష్టాత్మకమైన కాలేశ్వరం ప్రాజెక్టు మీద కేసు వేసి అందులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు హరీష్ రావు తారక రామారావు లాంటి వారి మీద ప్రైవేట్ కేసు వేయడం జరిగింది ఇలా ఎన్నో సమస్యల మీద చట్ట ప్రకారంగా పోరాడుతున్న రాజలింగమూర్తిని చంపడం అమానుషం అని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు

ప్రశ్నించే వారిని చంపడం అనేది సమంజసం కాదని దీన్ని తీవ్రంగా తీన్మార్ మల్లన్న టీం ఖండిస్తుంది దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని మళ్లీ భూపాలపల్లిలో ఇలాంటి హత్యలు పునరావృతం కావద్దని భూపాలపల్లి ప్రజలు కూడా భయాందోళనలో గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు ఎవరు చేసిన సహించేది లేదని రవి పటేల్ అన్నారు

రాజలింగమూర్తిని హత్య చేసిన వారిని ఎవరినైనా వదలకుండా వారితో ఎంతమందికి సంబంధాలు ఉన్నాయో వారందరినీ కూడా చట్టప్రకారం శిక్షించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు

ఇందులో జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా నాయకులు ప్రణయ్ సమ్మయ్య సంతోష్ కుమార్ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now