జేసీఐ నిజామాబాద్ ఇందూర్ – జేసీఐ వారం 7వ రోజు వాలెడిక్టరీ వేడుకలు

జేసీఐ నిజామాబాద్ ఇందూర్ – జేసీఐ వారం 7వ రోజు వాలెడిక్టరీ వేడుకలు*

 

నిజామాబాద్ సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం)

 

సోమవారం రాత్రి టి.ఎన్.జీఓ భవన్ లో జేసీఐ నిజామాబాద్ ఇందూర్ ఆధ్వర్యంలో జేసీఐ వారం 7వ రోజు ముగింపు వేడుకలు గౌతమి పెండోటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి.

ముఖ్య అతిథి గా జిల్లా బి సి ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు, మదవేటి వినోద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వారి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి శిక్షణలు ఇస్తూ , ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న JCI అధ్యక్షురాలు మరియు వారి సభ్యులను అభినందించారు.

జోన్ 12 జేసీఐ వారోత్సవాల అధికారి నయన్ జోన్ 12 అవార్డ్స్ ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జేసీఐ వారోత్సవాలకు సహకరించిన యోగా మాస్టర్ డాక్టర్ ఐశ్వర్య గారిని, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ శ్రీహరి తిరునగరి గారిని సన్మానించారు. ప్రిన్సిపల్ శ్రీమతి కల్పనా గారికి, శ్రీమతి వీణ గారికి బహుమతులు ప్రదానం చేశారు. జేసీఐ వారాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రాజెక్ట్ చైర్మన్లు మరియు సభ్యులు కు అభినందనలు తెలియజేశారు. అలాగే పూర్వ అధ్యక్షులను సత్కరించారు.

 

తదుపరి సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యాలు, హాస్య స్కిట్లు, వెంట్రిలోక్విజం, మిమిక్రీ కళాకారుడు శంకర్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమం లో విశిష్ట అతిథులుగా జిల్లా బి సి ఉపాధ్యాయుల సంఘం ముఖ్య కార్యదర్శి రాఘవపురం గోపాల కృష్ణ, ప్రత్యేక అతిథులుగా తెలంగాణ మెడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవేంద్ర కులకర్ణి, వారోత్సవాల చైర్మన్ రమేష్ కర్కా, కార్యదర్శి జైపాల్, పూర్వ అధ్యక్షులు వడ్డీ శ్రీనివాస్, కోటగిరి చంద్రశేఖర్, పూర్ణ చందర్, పెండోటి చంద్రశేఖర్, యాదేశ్ గౌడ్, మనోజ్ కుమార్, సభ్యులు వినోద్,తేజస్వి, యశ్వంత్, హనుమండ్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment