జీడిపల్లి దీపికా EWS సర్టిఫికేట్ కుంభకోణం
– అవినీతి బండారం బయటపడింది!
– నిబంధనలను తుంగలో తొక్కి, అవినీతికి లొంగిన రెవెన్యూ శాఖ
– పేద విద్యార్థుల హక్కులను దోచిన ఘాతుకం!
– జీడిపల్లి దీపికా ఇడబ్ల్యూఎస్ మోసం బహిరంగం!
– ఎంఆర్‌వో నివేదికలో నిజాలు బయటపడ్డాయి
– అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది
గురజాల మధుసూదన్ రెడ్డి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి ఎమ్మార్వో కార్యాలయం నుంచి వచ్చిన అధికారిక నివేదికలో జీడిపల్లి దీపికా (D/o జీడిపల్లి నర్సింహా రెడ్డి) తప్పుడు సమాచారం ఇచ్చి (EWS) సర్టిఫికేట్ పొందినట్లు స్పష్టంగా బయటపడిందనీ హయత్ నగర్, వనస్థలిపురం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు.
ఎంఆర్‌వో నివేదిక ప్రకారం ఎలాంటి ధృవీకరణ లేకుండా ఒక్క రోజులోనే సర్టిఫికేట్ మంజూరు!, 14.06.2019న EWS సర్టిఫికేట్ (No. EWS021900021280) కోసం దీపికా దరఖాస్తు చేసింది. అదే రోజున సర్టిఫికేట్ మంజూరు చేశారు, అంటే ఎటువంటి పరిశీలన లేకుండానే ఇవ్వబడిందనీ వారి పరిశీలనలో తేలింది.
తప్పుడు భూస్వామ్య డిక్లరేషన్ – నిబంధనలకు విరుద్ధంగా, దీపికా తన కుటుంబానికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉందని తప్పుడు సమాచారం ఇచ్చింది.
కానీ, 2019 ఎంపీటీసీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం:
జీడిపల్లి నర్సింహా రెడ్డి, (తండ్రి) పేరు మీద 6.04 ఎకరాలు, జీడిపల్లి లత (తల్లి) పేరు మీద 6.21 ఎకరాలు, మొత్తం 12.25 ఎకరాలు, అంటే EWS పరిమితి 5 ఎకరాలను మించిపోయాయి.
రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం…?
– ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా!
భూముల రికార్డులు, ఆదాయ రికార్డులు ధృవీకరించకుండా EWS సర్టిఫికేట్ ఇచ్చారు. భారత ప్రభుత్వ మెమో నెం. 36039/1/2019-Estt (Res.), తేదీ 31.01.2019 ప్రకారం, కుటుంబానికి ఏ ప్రాంతంలో ఉన్న భూమి అయినా లెక్కించాలి ఆదాయ వనరులను సరిచూసి మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఈ నియమాలను అధికారులు ఉల్లంఘించారు, ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్, కామారెడ్డికి అధికారిక ఫిర్యాదు!
ఫిర్యాదులో నా డిమాండ్లు అని హయత్ నగర్, వనస్థలిపురం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. దీపికా ews సర్టిఫికేట్ (EWS021900021280) వెంటనే రద్దు చేయాలి!
BNS సెక్షన్లు 316, 180, 181, 61, 224 కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలి, సర్టిఫికేట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, పేదల హక్కులను కాజేయడం మేము సహించము, ఈ సంఘటన EWS రిజర్వేషన్‌ను ధనిక, రాజకీయంగా బలమైన వ్యక్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వీరి ద్వారా బట్టబయలైంది అన్నారు.
నిజమైన పేద విద్యార్థులకు రావాల్సిన అవకాశాలను, రిజర్వేషన్లను మోసగాళ్లు దోచుకుంటున్నారు. నేను వెనక్కి తగ్గను – ఈ కేసును హైకోర్టు వరకూ తీసుకెళ్తాను, పేద విద్యార్థులకు అన్యాయం జరిగేలా చూస్తూ ఊరుకోను అని గురుజాల మధుసూదన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు