14వ సారి రక్తదానం చేసిన జీవన్ నాయక్..
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తల సేమియా బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో రక్తదాత జీవన్ నాయక్ 14వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జీవన్ నాయక్ మాట్లాడుతూ. రక్తదానం చేయడం వల్ల ఒకరి జీవితాన్ని కాపాడగలమని, ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల సమూహం నిర్వాహకులు డాక్టర్ బాలు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
14 సారీ రక్తదానం చేసిన జీవన్ నాయక్
by kana bai
Published On: October 20, 2024 10:09 pm