జెర్సీలు డొనేట్ చేసిన లింగాల చిన్న శంకర్ గౌడ్ 

జెర్సీలు డొనేట్ చేసిన లింగాల చిన్న శంకర్ గౌడ్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26:

ఇటీవల రామారెడ్డి మండలంలో జరిగిన టోర్నమెంట్ లో సీఎం కప్ జిల్లా స్థాయి జట్టు సెలెక్షన్ ఎంపిక చేయటం జరిగింది. గురువారం నుండి హైదరాబాద్ లో జరగనున్న సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొనటానికి జిల్లా జట్టు హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది.

క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడల పై మక్కువ కలిగిన రామారెడ్డి గ్రామ (మండల)కేంద్రానికి చెందిన చిన్న శంకర్ గౌడ్ జిల్లా ఫుట్బాల్ క్రీడా జట్టుకు 22 జతల జెర్సీలు డొనేట్ చేసి క్రీడల పై,క్రీడాకారుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ విధంగా దాతలు ముందుకొస్తే క్రీడల్లో ఆటగాళ్లు కేవలం సీఎం కప్ లాంటి రాష్ట్ర స్థాయి క్రీడల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ఆటల్లో కూడా రానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.క్రీడలు ఆడటం మూలంగా యువత మత్తు పానియాలకు ఇతర చెడు అలవాట్ల వైపు వెళ్లే అవకాశాలు ఉండవని ప్రవీణ్ కుమార్ చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న ధర్ని ప్రవీణ్ కుమార్, గుర్జ కుంట స్వామి లు పి.డి. లు చందు, రసూల్, బాలరాజ్ లు శంకర్ గౌడ్ కు అభినందనలు తెలిపారు. జిల్లా కు ఫుట్ బాల్ కప్ తీసుకొని వస్తామని ఆట గాళ్ళు ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now