పి అర్ టి యు స్టేట్ మహిళా అసోసియేట్ ప్రెసిడెంట్ జెట్టి రాధ

*జెట్టి రాధ పి ఆర్ టి యు స్టేట్ మహిళ అసోసియేట్ ప్రెసిడెంట్ గా రెండవసారి ఎన్నిక*

 

*జమ్మికుంట అక్టోబర్ 9 ప్రశ్న ఆయుధం*

 

తెలంగాణ రాష్ట్ర పి ఆర్ టి యు సంఘంలో స్టేట్ మహిళా అసోసియేట్ ప్రెసిడెంట్ గా రెండవసారి జెట్టి రాధ ఎన్నికయ్యారు.14-10-1987లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పిఆర్టియు తెలంగాణ రాష్ట్రంలో మండల మహిళా ఉపాధ్యక్షురాలి నుండి అంచలంచలుగా ఎదిగి జిల్లా, స్టేట్ మహిళ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆమె సంఘంలో 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ హక్కుల గూర్చి ఎన్నో పోరాటాలు ధర్నాలు చేసినందుకు గాను రెండవసారి తమకు అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కర్రు సురేష్, ప్రధాన కార్యదర్శి గుండు కృష్ణమూర్తి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఓదెల మండలం ఇందుర్తిలో ఎంపి యుపిఎస్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Join WhatsApp

Join Now