Headlines
-
పెళ్లిరోజు సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్లు, నోట్ బుక్స్ అందజేసిన బీజేపీ నాయకుడు
-
బాసర గ్రామంలో విద్యార్థులకు ఉచిత సేవలు – ఆదర్శంగా నిలిచిన సుభాష్
-
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు హామీ ఇచ్చిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు
-
సామాజిక సేవలతో స్ఫూర్తిదాయకంగా మారిన జిడ్డు సంగీత సుభాష్
-
యువతకు ఆదర్శం – పెళ్లిరోజు సేవలతో మానవత్వాన్ని చాటుకున్న నాయకుడు
నర్సూరి.భీమ్ రావు
బాసర వార్త:-04
*అందరికీ ఆదర్శం నేటి స్ఫూర్తి యువత*..
నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన జిడ్డు. సంగీత సుభాష్ తన 14 వ పెళ్లిరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు ప్యాడ్లు,నోట్ బుక్ లు, పెన్నులను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.అటు రాజకీయంగా బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ తనకు తోచిన కాడికి ఏదో ఒక సాయం చేయాలన్న తపనతో ప్రతి సంవత్సరం విద్యార్థిని,విద్యార్థులతో పాటు సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న యాచకులకు స్వచ్ఛందంగా వివిధ సేవలను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఏదేమైనా పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరూ వృధా ఖర్చు కాకుండా ఇలాంటి సామాజిక ఆర్థిక సహాయ సహకరాలు అందించడం మన బాధ్యతని కొనియాడారు. అదేవిధంగా త్వరలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రైమరీ పాఠశాలను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.