బహిరంగంగా బెదిరింపులు – నన్ను మౌనం చేయాలని కుట్రలు చేస్తున్న జిడిపల్లి నరసింహా రెడ్డి, దీపికా
ప్రశ్న ఆయుధం హైదరాబాద్ :
నేను జి. మధుసూదన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు (హయత్‌నగర్ , వనస్థలిపురం). గత కొన్ని రోజులుగా జిడిపల్లి నరసింహా రెడ్డి, అతని కూతురు జిడిపల్లి దీపికా నాపై అసత్య ఆరోపణలు చేసి, బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇది నేను వారి అక్రమాలను బయటపెట్టడంతో, నేను వారి బెదిరింపులకు భయపడి వెనుకడుగు వేసేలా చేయాలనే కుట్రలు చేస్తున్నారని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నన్ను మౌనం చేయాలనే ప్రయత్నం ఆ తండ్రి కూతుళ్లు చేస్తున్నారన్నారు. నీవు డబ్బులు అడుగుతున్నావు అంటూ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాస్తవాలను దాచిపెట్టేందుకు వరు వేసిన డ్రామా మాత్రమే అని నాకు తెలుసు, నీ ఫిర్యాదులు వాపసు తీసుకో, లేదంటే నీ మీద కేసు పెడతాం అంటూ నన్ను బహిరంగంగా బెదిరిస్తున్నారు.నా కూతురు దీపికా వ్యవహారంలో నీకు సంబంధం లేదు, దూరంగా ఉండు అంటూ నాపై ఒత్తిడి తెస్తు నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు.
ఇది ఎందుకు
1. దీపికా అక్రమంగా తెచ్చుకున్న ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్,
2. తన ఎంబిబిఎస్ అడ్మిషన్‌లో జరిగిన అవకతవకలు,
3. పాల్వంచలో గ్రామంలో (Full Tank Level) చెరువు కబ్జా, బఫర్ జోన్ Buffer Zone లో నిర్మాణాలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. నాపై దాడులకు పాల్పడిన ఘటనల గురించి నేను అధికారులకు ఫిర్యాదు చేయడం, ఇవన్నీ బయటపడుతుండటంతో ఈ కుట్రలు పన్ని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ తండ్రి కూతుర్ల వల్ల నా భద్రతకు ముప్పు…..
గత మూడు రోజులుగా నా చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్న ఘటనలు గమనించాను. ఇది నాపై ఏదైనా దాడి చేయడానికి ప్రణాళిక ఉందన్న సంకేతాలు ఇస్తోంది. నాపై ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి పూర్తి బాధ్యత జిడిపల్లి నరసింహా రెడ్డి, జిడిపల్లి దీపికా వారి అనుచరులదే అని ఈ సందర్భంగా పలువురికి తెలియజేస్తున్నాను అన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి, నన్ను బెదిరించే జీడిపల్లి నరసింహా రెడ్డి, దీపికా పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నాపై ఎప్పుడైనా దాడిలు జరిగే అవకాశం ఉన్నందున నా భద్రత కోసం పోలీసు రక్షణ కల్పించాలి.
ఈ అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపి, వీరి అక్రమంగా సంపాదించిన భూములను, అవకతవకలతో పొందిన సీటును రద్దు చేయాలి. నేను ఎంతటి బెదిరింపులు, కుట్రలు వచ్చినా న్యాయపోరాటం నుంచి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అవినీతిపరులని, అక్రమార్కులని ఎండగడతూనే ఉంటాను అని హయత్ నగర్, వనస్థలిపురం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు.