నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 09:
నిజామాబాద్ ఉషామయూరి థియేటర్ లో జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముదిగంటి జితేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ముదిగంటి జితేందర్ రెడ్డి జాతీయవాద సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, అఖండ భారత్ యే లక్ష్యంగా నరహంతక నక్సలైట్లకు ఎదురెల్లి ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు జితేందర్ రెడ్డి అని అన్నారు.
ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అంటు వామపక్ష విద్యార్ధి సంఘాల, కమ్యూనిస్ట్ ముసుగులో దేశాద్రోహనికి పాల్పడుతున్న వారి పాలిట సింహ స్వప్నంగా మరి వారికీ కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి, టైగర్ జీతన్న. మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి ఒక్కొక్కరుగా ఎదుర్కొలేని కౌరవులు అందరు కలిసి ఎలా అయితే హతమార్చారో అలాగే జీతన్నాను వంద మంది ఒకేసారి చుట్టూముట్టి దారుణంగా చంపారన్నారు..
చరిత్ర తెలియనివాడు చరిత్ర సృష్టించలేదు అనేది వాస్తవం చరిత్ర ముసుగులో నేటి యువతరం అసలైన చరిత్రను తెలుసుకోలేకపోతుంది. ఈ దేశ యువత తెలుసుకోవాల్సింది అక్బర్, బాబర్, ఔరంగా జేబుల చరిత్ర కాదని ఈ దేశం కోసం, ధర్మం కోసం, తమ ప్రాణాలు అర్పించిన రామన్న, గోపన్న, సామా జగన్ అన్న, జితేందర్ రెడ్డి లాంటి వీరుల చరిత్ర తెలుసుకోవాలన్నారు.
ముదిగంటి జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను వెండి తెరమీదకి తెచ్చి యువతరానికి మంచి నిర్మాణాత్మక సందేశాన్ని అందించన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ క్షేత్రల సంఘ్ పెద్దలతో కలిసి సినిమాను విక్షించారు.