ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసం కు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. రంజాన్ మాసంలో చేయవలసిన ఏర్పాట్లపై శనివారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు మరియు ముస్లిం మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, మసీదుల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్త ఎప్పటికప్పుడు పరిశుభ్రం చెయ్యాలని, మంచినీటి సరఫరా లో భాగంగా బావులు, ట్యాంకులు శుభ్రం చేసి బ్లీచింగ్ చెల్లించాలని పంచాయతీ అధికారులు ఆదేశించారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రార్థన సమయానికి అనుగుణంగా రెండు పూటలా త్రాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని, మసీదు పెద్దలకు ఆ ప్రాంతం లైన్మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. వేసవిలో ఎండ భావం వల్ల ఇబ్బందులు కలక్కుండా ముందస్తు చర్యలు, పర్యవేక్షణ చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రార్థన మందిరాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. రంజాన్ పర్వదినం రోజు సరిపడా పాలు అందుబాటులో ఉండే విధంగా విజయ డైరీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయవలసిందిగా సిపిఓ సంజీవరావు ఆదేశించారు. జిల్లాలోని ఉన్న మసీదులు మరియు వాటి మత పెద్దల వివరాలను అందజేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రజలకు వస్తువులు కొనుగోలు చేయటానికి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సమయం దుకాణాలు తెరిచి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారిని ఆదేశించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, పోలీస్ శాఖ అధికారులు, కార్మిక శాఖ అధికారి, ఆర్ ఎం బి ఈఈ వెంకటేశ్వర్లు మరియు విద్యుత్ శాఖ అధికారులు, ముస్లిం మత పెద్దలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు రావద్దు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
