*జీవో 25 రద్దుకై సంఘాలకతీతంగా పోరాడాలి -ప్రైమరీ స్కూల్ టీచర్స్*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 24
జమ్మికుంట మండలంలోని ఎమ్మార్సీనందు జమ్మికుంట ఇల్లందకుంట మండలాల్లో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ టీచర్స్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాల పిల్లలు వస్తున్న పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు భోదించాలనే జీవో 25 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఐదో తరగతి వరకు ఐదు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని,ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని,ఎస్ జి టీ లకు తక్షణమే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగించాలని నవంబర్ లో నిర్వహించే నాస్ పరీక్షల ఫలితాలపై కూడా ఈ జీవో ప్రభావం పడుతుందని పిఆర్సి లో ఎస్ జి టీ లకు స్కూల్ అసిస్టెంట్లకు ఉన్న వ్యత్యాసాన్ని ఈ పి ఆర్ సి లో తొలగించి ఎగ్జిట్ లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గురువారం 26తేదీన ఇల్లందకుంట జమ్మికుంట మండలంలోని ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనే విధంగా కార్యాచరణను రూపొందిస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమిల్ల బలరాం దబ్బెట రవీందర్ శ్రీనివాస్ నాగరాజు రజాక్ పాషా కుమారస్వామి
నాగరాజు సమ్మయ్య శ్రీనివాస్ దేవేందర్ సంపత్ సారంగం
రాజిరెడ్డి సాంబయ్య శ్రీధర్ వీరస్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.