జీవో నెంబర్ 25 ను సవరించాలి

పిఆర్టియు టి ఎస్ మండల అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి

జగదేవపూర్ సెప్టెంబర్ 23 ప్రశ్న ఆయుధం :

పి ఆర్ టి యు టీఎస్ జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్ లు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ మధ్యన జరిగిన ఎస్ జి టి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి అయినా కొంతమంది ఉపాధ్యాయులు రిలీవర్సు లేక పాత స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఇది పూర్తి కాకముందే ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన జీవో 25 ను జారీ చేసింది. ఆ జీవోలో 10+ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలకు రెండవ పోస్ట్ కేటాయించడం మంచి పరిణామమే అయినా ఉపాధ్యాయుల,విద్యార్థుల నిష్పత్తి సమతూకంగా లేకపోవడం వల్ల ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఆ జీవోను సవరించాలని కోరుతున్నాం. దీనివలన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగి ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రాథమిక పాఠశాల మూలాలు బాగుంటేనే ఉన్నత పాఠశాల బాగుంటాయి. ప్రభుత్వం పాఠశాలలకు ఎన్నో రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన, ప్రాథమిక పాఠశాలలు మెరుగుపడాలంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి.పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి విషయాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని కేటాయించాలి. మెసేజ్ పెట్టని యెడల మండల విద్యాధికారి మరియు కాంప్లెక్స్ నుండి ఫోన్ వస్తుంది. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ప్రాథమిక పాఠశాలలో వారి బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం విద్యావ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడము శుభ పరిణామం. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు విద్య పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నందున మీ నిర్ణయానికి కృతజ్ఞతలు. ప్రభుత్వము మరొకసారి పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ,రఘురాము,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, మండల కార్యవర్గ సభ్యులు నగేష్,భగవాన్ రెడ్డి,అనురాధ, రంజిత్ కుమార్, విజయలక్ష్మి,గోపికళ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now