*జీవో నెంబర్ 25 ని సవరించాలి- తపస్*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 25*
జీవో నెంబర్ 25 ను సవరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది ఇల్లందకుంట మండలంలోని సభ్యత్వ అభియాన్ లో భాగంగా వివిధ పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి జగన్ మోహన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 25ని సవరించి ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించాలని పెండింగ్లో ఉన్న డి ఏ లను విడుదల చేసి పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) లలో పని చేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి హెల్త్ కార్డు లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమం లో తపస్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాంబయ్య కుమార స్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు