జెఎన్టియుహెచ్ వైస్-ఛాన్సలర్ (విసి)గా టీ. కిషన్ కుమార్ రెడ్డి నియామకం
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 21: కూకట్‌పల్లి ప్రతినిధి
జెఎన్టియుహెచ్ వైస్-ఛాన్సలర్ (విసి)గా టీ. కిషన్ కుమార్ రెడ్డి నియామకం విశ్వవిద్యాలయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది.గత 16 సంవత్సరాలుగా, ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లను విసిగా నియమిస్తున్న పరిస్థితిలో, ఈసారి జెఎన్టియుహెచ్ లోనే పనిచేసి, రిటైర్మెంట్ పొందిన మెకానికల్ విభాగం ప్రొఫెసర్‌ను విసి గా ఎంపిక చేయడం విశేషం.
ఈ సందర్భంలో జెఎన్టియుహెచ్ – జెఎసి సభ్యులు విసి ని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు, శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించి, గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం, విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థుల సమస్యలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలపై విసి తో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
జెఎన్టియుహెచ్ను భారతదేశంలో నంబర్ 1 విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను ఈ సమావేశంలో వ్యక్తం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో జెఎన్టియుహెచ్ – జెఎసి చైర్మన్ మంద రంజిత్ కుమార్, ప్రెసిడెంట్ కోతురు పవన్, వైస్ ప్రెసిడెంట్ మూడ్ నరేష్, బొజ్జ ప్రణయ్ భాస్కర్, సభ్యులు సందీప్, సాగర్,వంశీ, రవి, వినయ్, నితీష్, శ్రీకర్ తదితరులు పాల్గొని విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు.