మంజీర కళాశాలలో జాబ్ మేళా విజయవంతం

మంజీర కళాశాలలో జాబ్ మేళా విజయవంతం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ, పేజీ కళాశాలలో ఎమ్మెస్ఎన్ కంపెనీ, టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం అయిందని కళాశాల చైర్మన్ కే. గురువేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కే. గురువేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అర్హతకు తగ్గ ఉపాధి లభించినప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ తమ చదువు తర్వాత ఉపాధిని సంపాదించుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో వందకు పైగా నిరుద్యోగులు హాజరయ్యారన్నారనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు జనార్ధన్, సీతారాం, టాస్క్ ప్రతినిధులు తుకారాం, శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now