జాన్ వెస్లీ అరెస్ట్ సిగ్గుచేటు..!

పేద ప్రజలకు స్థలాలు ఇవ్వాలని అడిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అడిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీని అరెస్టు చేయడం సిగ్గుచేటు అని సిపిఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పేద ప్రజలకు 2007లో ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి వారికి ఆ స్థలం చూపించకుండా రామోజీ ఫిలిం సిటీకి వత్తాసు పలుకుతూ పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని రామోజీ ఫిలిం సిటీకి అప్పగించడంపై గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన 75 మంది పేద ప్రజలపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు అన్నారు. బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఆ జిల్లా పార్టీ నాయకులతో, 400 మంది పేద ప్రజలతో కలిసి వెళ్లి ఇదేంటి అని ప్రశ్నించిన ఆయన్ను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వాలకు చేతకాకపోతే సిపిఎం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వ స్థలాలు గుర్తించి మేమే పంపిణీ చేస్తామని మరోమారు హెచ్చరించారు. పోలీసులు రాష్ట్ర కార్యదర్శి పట్ల, ఆ జిల్లా నాయకులు ప్రజల పట్ల మరి దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్టు చేయడం ఏంటని, బూతులు తిడుతూ పేద ప్రజలపై దాడులు చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. సిపిఎంపార్టీ రాష్ట్ర కార్యదర్శి అరెస్టు పట్ల ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

Join WhatsApp

Join Now