Site icon PRASHNA AYUDHAM

చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల?24

విడుదల
చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల?

హైదరాబాద్, డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 24

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్.జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది,బాధిత యువతి.
పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
తొలుత జానీ మాస్టర్‌కు ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తరువాత గడువు ముగియడంతో.. మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా..
తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Exit mobile version