బిజెపిలో పలువురు యువకులు చేరిక
జమ్మికుంట ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆద్వర్యంలో పలువురు యువకులు బిజెపి పార్టీలో చేరగా కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 18 వ వార్డు కి చెందిన యువకులు అడిశెర్ల నాగరాజు, బోగ సురేష్ 18వ వార్డు అధ్యక్షుడు అవాంచ వెంకటేష్ సమక్షంలో ఆదివారం రోజున కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, బిజెపి పార్టీ మాత్రమే యువత గురించి, దేశం గురించి ఆలోచన చేస్తుండటంతో నరేంద్ర మోడీ సుపరిపాలన కళ్ళారా చూస్తున్నామని వారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరడం జరిగిందని రేపు రాష్ట్రంలో అధికారంలో రాబోయే పార్టీ బిజెపి అని బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేయాలనే సంకల్పంతో బిజెపి పార్టీలో చేరుతున్నట్లు అడిశెర్ల నాగరాజు పేర్కొన్నారు ఈకార్యక్రమంలో సారంగపాణి, గుగ్గిల సాగర్, పర్వత శివ, పెండ్యాల వంశీకృష్ణ, ఆకుల రాహుల్ హుస్సేన్ తదితరులు పార్టీలో చేరారు.