*మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రత్యేక బృందం అధికారిగా జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్*
ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలో అందిస్తున్నా మధ్యాహ్న భోజన నాణ్యత, శుభ్రత పరిశీలనకు జనగామ జిల్లాలో రెండు ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఏర్పాటు చేశారు..
ఒక బృందానికి టీం లీడర్ గా జనగామ జిల్లా జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్, డి ఎల్ పి ఓ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, డిప్యూటీ జెడ్పి సీఈవో సరిత, జిల్లా సమన్వయకర్త బి శ్రీనివాస్ లు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, జఫర్ గడ్, చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల్లోని ప్రభుత్వం గురుకులాలు, పాఠశాలలోని ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తారు.