కామారెడ్డి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకోవాలి జాయింట్ కలెక్టర్ కలిసిన విద్యార్థులు 

కామారెడ్డి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకోవాలి జాయింట్ కలెక్టర్ కలిసిన విద్యార్థులు

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల నుండి గాంధారి వరకు ఆర్టీసీ బస్సులు మూడు ట్రిప్పులు ఆర్టీసీ బస్సు నడపాల్సి ఉంది కానీ ఆర్టీసీ డిఎం లింగంపేట్ నుండి గాంధారి వరకు ఉదయం మరియు సాయంత్రం ఒకటి ట్రిప్పు వస్తుందని అది కరెక్ట్ టైం కు ఆర్టిసి బస్సు రావడంలేదని. ఆర్టీసీ బస్సు కోసం సాయంత్రం నాలుగు పది నుండి రాత్రి 7 గంటల వరకు వేచి చూస్తున్నామని. ఆర్టీసీ డి ఎం కు ఎన్నిసార్లు విన్నవిచ్చిన స్పందించడం లేదని విద్యార్థులు అంటున్నారు రామలక్ష్మణ పల్లె విద్యార్థులు గ్రామస్తులు కామారెడ్డి డిఎం కి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసిన ఏమాత్రం స్పందించడం లేదని రామలక్ష్మణ పల్లె వాళ్ళు నల్లమడుగు స్కూల్ కి 150 మంది పిల్లల్ని నిత్యం చదువుకోవడానికి వెళుతుంటారు స్కూల్ పిల్లల టయానికి బస్సు పంపండి అని కామారెడ్డి ఆర్టీసీ డిఎం కి మొరపెట్టుకుంటే మేడం మాటలు నేను వెయ్యను మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అవసరమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి కానీ నేను బస్సు పంపే పరిస్థితి లేదు అని కరాకాటిగ తన మొండి వైఖరిని వెల్లడించడంతో కలెక్టర్ కి విన్నవించడానికి గ్రామం నుండి 100 మందితో గ్రామ పెద్దలు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు కామారెడ్డి ఆర్టీసీ డిఎం కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోన్ ద్వారా లింగంపేట్ నుండి గాంధారి కి మూడు ట్రిప్పులు ఆర్టీసీ బస్సు నడపాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ డిఎంకు సమాచారం ఇవ్వగా వేస్తానని చెప్పి ఇప్పుడు ఆర్టీసీ బస్సు మూడు ట్రిప్పులు కాదు ఒక్క ట్రిప్పు కూడా ఆర్టీసీ బస్సు టైం కు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు కామారెడ్డి ఆర్టీసీ డిఎం ఇకనైనా స్పందించి ఆర్టీసీ బస్సు నల్లమడుగు గాంధారి రోడ్ గుండా ఒక్క రోజుకు ఐదు ట్రిప్పులు తగ్గకుండా వేస్తే బాగుంటుందని గ్రామస్తులు విద్యార్థులు డిమాండ్ చేశారు బస్సు వెయ్యకుంటే కామారెడ్డి బస్టాండ్ ప్రధాన చౌరస్తాలో ధర్నాలకు వస్తామని విద్యార్థులు హెచ్చరించారు వారి వెంట గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment