పరిశ్రమలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయాలి: ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): పరిశ్రమలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయాలని, కార్మికుల భద్రతను గాలొకొదిలేసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, నవ భారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ అన్నారు. శనివారం మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. పాశమైలారం సిగాచి కంపెనీ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం కారణంగానే సిగాచి ఘటన జరిగిందని, రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రమాదంగా జరిగిందని మెట్టుశ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబధిత శాఖల అధికారులు పరిశ్రమలను తనిఖీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే కంపెనీ యజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను తుంగలో తొక్కుత్తున్నా.. అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. బొల్లారం పాశమైలారం పారిశ్రామిక వాడల్లో నిరంతరం ప్రమాదాలు జరుతున్నా భాద్యులైన కంపెనీ యజమానులపై సంబధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకోకపోవడం భాధాకరమని మెట్టు శ్రీధర్ పేర్కొన్నారు. కంపెనీల చట్టాలను కార్మిక చట్టాలను పర్యావరణ చట్టాలేవి కూడా అమలు కలవడం లేదని అతి పెద్ద పారిశ్రామిక వాడలైన బొల్లారం పాశమైలారం ప్రాంతాల్లో కార్మికుల కోసం అత్యవసర పరిస్థితుల్లో తరలించడానికి అంబులెన్సులను మరియు హాస్పిటల్ తో పాటు అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వాన్ని మెల్కొలిపే అంశమని, ఇప్పటికైనా ప్రభుత్వం తగుచర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని, సిగాచి ప్రమాదంలో మరణించిన భాధితులకు క్షతగాత్రులకు పూర్తి సహాయం త్వరితగతిన అందేవిధంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మెట్టు శ్రీధర్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment