జనవరి 4, 2025 న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ -2025 పోటీ..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28
మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, నిజామాబాద్ డివిజన్ ( నిజామాబాద్ జిల్లా & కామారెడ్డి జిల్లా ) ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలు జనవరి 4, 2025 (శనివారం) ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి12వ తరగతి (ఇంటర్మీడియట్ ) వరకు చదువుతున్న విద్యార్థులు వారి పాఠశాల / కళాశాల నుంచి పాల్గొనవచ్చు.
ఒక పాఠశాల / కళాశాల నుంచి (5 )జట్లకు అవకాశం ఉంది. ఒక జట్టులో ఇద్దరు విద్యార్థులు ఉండాలి.
“ నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగం మరియు మాదక ద్రవ్యాల వలన నష్టం “ అనే అంశం మీద క్విజ్ జరుగుతుంది.
క్విజ్ తెలుగు & ఆంగ్లం భాషలో ఉంటుంది.
క్విజ్ రెండు దశలలో ఉంటుంది. మెుదట (25) మార్కులకు రాత పరీక్ష నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన (6) పాఠశాల జట్లను ఎంపికచేస్తారు.
రెండవ దశకు ఎంపికైన ( 6 ) జట్లకు రెండవ దశలో స్టేజి మీద దృశ్య మరియు శ్రవణ మాధ్యమం ద్వారా ప్రొజెక్టర్ సహాయంతో ఫైనల్ క్విజ్ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రతిభ చూపి రెండవ దశకు ఎంపిక కాని మెుదటి (10) జట్లకు ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ధృవీకరణ పత్రం ఇస్తారు.
స్టేజి రౌండులో విజేతలకు డిజిటల్ ట్యాబ్ లు, డిజిటల్ గడియారాలు, పుస్తకాలు, ధృవీకరణ పత్రాలు మరియు జ్ఞాపకలను బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు 99664 40700 ( నిజామాబాద్ ) / 93946 80680 ( కామారెడ్డి ) నెంబరుకు ఫోన్ చేసి జనవరి 2వ తేది వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ , నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎర్పాటు చేయడం జరిగింది.
వి. సోమిరెడ్డి,
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్, నిజామాబాద్ డివిజన్