జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి APWJU

*జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి APWJU*

*ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఉచిత విద్య అందించాలి*

*మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU*

*మంత్రి లోకేష్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం*

*ఉచిత విద్య ప్రత్యేక జీవో ఇస్తాం*

*కోన శశిధర్ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి*రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ ఉచిత విద్య ఇవ్వాలని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లలో జర్నలిస్టు పిల్లలకు ప్రత్యేక కోట ఇవ్వాలని ఉచిత విద్యకు సంబంధించి ప్రత్యేక జీవో ప్రభుత్వం విడుదల చేయాలని జర్నలిస్టులకు ఉచిత విద్యను ఇచ్చి ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు

 ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోను ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించే విషయం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు జర్నలిస్టు పిల్లలకు మంచి విద్యను అందించేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని జర్నలిస్టులకు అండగా ఉంటామని కోన శశిధర్ అన్నారు

 జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సహకారం అందిస్తామని జర్నలిస్టులు అడుగుతున్నది న్యాయమైనదే అని కోన శశిధర్ అన్నారు

 గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో మచ్చా రామలింగారెడ్డి నాయకత్వంలో అప్పట్లో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకి అనంతపురం జిల్లాలో ఉచిత విద్యను ఇవ్వడం జరిగిందని జర్నలిస్టులకు గుర్తు చేశారు 

 తాను కలెక్టర్ గా ఉండగా కొడిమి జర్నలిస్టు కాలనీలో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు సౌకర్యాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్రంలో మొట్టమొదటి కాలనీ అనంతపురంలో ఉండడం అభినందనీయమని కోన శశిధర్ అన్నారు

జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యకు సంబంధించి ఒక ప్రత్యేక జీవో ఇవ్వాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు జీవో ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామని ప్రత్యేక జీవో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ హామీ ఇచ్చారు 

 అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన కోన శశిధర్ తో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU ప్రతినిధి బృందం జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద చర్చించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ను వర్కింగ్ జర్నలిస్టులు సన్మానించారు

 ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు విజయరాజు, వెంకటేశ్వర్లు, షాకీర్, రఘు, సాయి ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు 

APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్*

Join WhatsApp

Join Now

Leave a Comment